Akshay Kumar: రియల్ లైఫ్‌లోనూ హీరో అనిపించుకున్న అక్షయ్ కుమార్..!

  • జుహు బీచ్ వద్ద రూ.10 లక్షలతో టాయిలెట్ ఏర్పాటు
  • ఇందుకు భార్య ట్వింకిల్ ఖన్నా చొరవ
  • శివసేన నేత ఆదిత్య థాకరే సాయం

ఒకప్పుడు బాలీవుడ్ యాక్షన్ హీరోగా వెలుగొందిన అక్షయ్ కుమార్ తర్వాత చాలా ఏళ్లుగా విభిన్న పాత్రలతో, కథాంశాలతో ఫ్యాన్స్‌ని అలరిస్తూ వస్తున్నాడు. తనకు అవకాశం వచ్చినప్పుడల్లా సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ రియల్ లైఫ్‌లోనూ హీరో అనిపించుకుంటున్నాడు. తాజాగా అతను ముంబైలోని జుహు బీచ్ వద్ద రూ.10 లక్షలు ఖర్చు చేసి టాయిలెట్‌ని ఏర్పాటు చేయించాడు.

ఈ టాయిలెట్ ఆలోచనకు అతని భార్య, నటి ట్వింకిల్ ఖన్నా ప్రధాన కారణం. అక్కీ నటించిన 'టాయిలెట్ : ఏక్ ప్రేమ్‌కథా' చిత్రం విడుదలయిన మరుసటి రోజు ట్వింకిల్ సరదాగా జుహు బీచ్ వద్ద వాకింగ్‌కి వెళ్లింది. అక్కడ ఓ యువకుడు బీచ్ వద్దే మలవిసర్జన చేస్తుండటాన్ని ఆమె గుర్తించింది. వెంటనే ఆ ఫొటో తీసి ఆమె ట్విట్టర్‌లో పోస్టు చేసింది. దాంతో అక్షయ్ టాయిలెట్ కట్టించాలని నిర్ణయించుకున్నాడు. దీనికి శివసేన నేత ఆదిత్య థాకరే కూడా సాయం చేశారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News