charan: విజయేంద్రప్రసాద్ గారికి కృతజ్ఞతలు .. ఆయన నుంచే నేర్చుకున్నాను: సుకుమార్

  • కథా రచనకు ఎక్కువ సమయం తీసుకునేవాడిని 
  • 'రంగస్థలం' కథను 20 నిమిషాల్లో రెడీ చేసుకున్నాను 
  • అందుకు కారకులు విజయేంద్ర ప్రసాద్ గారే  

'రంగస్థలం' సినిమా రికార్డుస్థాయి వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ సినిమా చూసిన వాళ్లంతా దర్శకుడు సుకుమార్ ను అభినందిస్తున్నారు. 1985 నాటి కాలానికి తమను తీసుకెళ్లాడంటూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. వాళ్ల ఆదరణకు కృతజ్ఞతలు తెలుపుతూ .. సుకుమార్ ఒక ఆసక్తికరమైన విషయాన్ని చెప్పుకొచ్చారు.

 "సాధారణంగా నేను ఒక కథను రెడీ చేసుకోవడానికి ఎక్కువ సమయం తీసుకుంటూ వుంటాను. కానీ 'రంగస్థలం' కథ మొత్తాన్ని నేను సిద్ధం చేసుకోవడానికి 20 నిమిషాలే పట్టింది. అందుకు కారకులు విజయేంద్ర ప్రసాద్ గారు. 'బజరంగీ భాయిజాన్' తెరకెక్కడానికి ముందు .. ఆ కథను ఆయన నాకు 20 నిమిషాల్లో చెప్పారు. యథాతథంగా ఆ కథ తెరపై ఆవిష్కృతం కావడం చూసి ఆశ్చర్యపోయాను. కథా రచనకు ఎక్కువ సమయం తీసుకోకూడదనే విషయాన్ని అప్పుడే గ్రహించాను. నాకు స్ఫూర్తిగా నిలిచిన విజయేంద్ర ప్రసాద్ గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను" అని చెప్పుకొచ్చారు. 

  • Loading...

More Telugu News