google pixel: చౌక ధరలో గూగుల్ పిక్సెల్ స్మార్ట్ ఫోన్... భారత్ కోసం ప్రత్యేక విధానం
- ఈ ఏడాది ఆగస్ట్ లోపు విడుదలకు అవకాశాలు
- ఖరీదైన ల్యాప్ టాప్ పిక్సెల్ బుక్ కూడా ఆవిష్కరణ
- భారత మార్కెట్ కోసమే ప్రత్యేక ఉత్పత్తులు
ప్రపంచంలో అతిపెద్ద స్మార్ట్ ఫోన్ మార్కెట్ గా అవతరిస్తున్న భారత్ విషయంలో ఓ ప్రత్యేక విధానాన్ని రూపొందించి, అమలు చేయాలన్న తలంపుతో టెక్నాలజీ దిగ్గజం గూగుల్ ఉంది. తన ఉత్పత్తులకు భారత్ లో అమిత ఆదరణ ఉండడంతో ప్రత్యేక విధానం ద్వారా ఇక్కడ మరింతగా విస్తరించాలని భావిస్తోంది. ఇందులో భాగంగా గూగుల్ పిక్సెల్ స్మార్ట్ ఫోన్ ను భారత మార్కెట్ కోసమే ప్రస్తుతం విక్రయిస్తున్న ధర కంటే తక్కువలో తీసుకువచ్చే పనిలో ఉందని మార్కెట్ వర్గాల సమాచారం.
ఈ ఏడాది జులై లేదా ఆగస్ట్ నెలల్లో భారత్ కోసమే ప్రత్యేకంగా రూపొందించే గూగుల్ స్మార్ట్ ఫోన్లు విడుదల కావొచ్చని అంచనాలున్నాయి. అలాగే, గూగుల్ పిక్సెల్ బుక్ తో ఖరీదైన ల్యాప్ టాప్ ను కూడా విడుదల చేయనుంది. ఇంకా గృహ ఆటోమేషన్ ఉత్పత్తులు డోర్ బెల్, కెమెరా, అలార్మ్ సిస్టమ్, స్టోక్ డిటెక్టర్ ను నెస్ట్ బ్రాండ్ కింద విడుదల చేసే ప్రణాళికతో ఉంది.