Mohan babu: అందుకు చిరంజీవి తప్పక గర్వపడతారు : మోహన్‌బాబు

  • 'రంగస్థలం' సినిమాను త్వరలోనే చూస్తాను
  • కొడుకులు ఎంచుకున్న రంగాల్లో రాణించడం కంటే తండ్రులకు ఇంకేం కావాలి
  • చరణ్, రంగస్థలం చిత్ర యూనిట్‌కి అభినందనలు

మెగాస్టార్ చిరంజీవి తన తనయుడు మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ తేజను చూసి తప్పకుండా గర్వపడతారని ప్రముఖ నటుడు డాక్టర్. ఎం. మోహన్ బాబు అన్నారు. చరణ్ నటించిన 'రంగస్థలం' సినిమా విడుదలైన మూడు రోజుల్లోనే వందకోట్ల క్లబ్‌లో చేరి అదే దూకుడును కొనసాగిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన వస్తోందని తాను వింటున్నానని విలక్షణ నటుడు చెప్పారు.

త్వరలోనే తానీ సినిమాను చూస్తానని ఆయన ట్వీట్ చేశారు. చరణ్‌కి, రంగస్థలం చిత్ర యూనిట్‌ మొత్తానికి ఆయన ట్పిట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు. తమ తనయులు వారు ఎంచుకున్న రంగాల్లో రాణిస్తే తండ్రులకు అంతకంటే కావాల్సింది మరొకటి ఉండదని మోహన్ బాబు అన్నారు. అందరు తండ్రుల్లాగే చిరంజీవి కూడా తన తనయుడి రాణింపును చూసి తప్పక గర్వపడతారని ఆయన అభిప్రాయపడ్డారు.

Mohan babu
Chiranjeevi
Ramcharan
Rangasthalam
  • Loading...

More Telugu News