raghuveera reddy: మేము అధికారంలోకి వస్తే తొలి సంతకం దీనిపైనే: రఘువీరారెడ్డి

  • ఏపీకి ప్రత్యేక హోదాపైనే తొలి సంతకం
  • టీడీపీ, వైసీపీలకు చిత్తశుద్ధి లేదు
  • సమైక్యాంధ్ర ఉద్యమం లాగానే ఇప్పుడు కూడా రాజకీయాలు చేస్తున్నారు

2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే... తొలి సంతకం ఏపీకి ప్రత్యేక హోదాపైనే చేస్తామని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తెలిపారు. ప్రత్యేక హోదాపై టీడీపీ, వైసీపీలకు చిత్తశుద్ధి లేదని... ఒకవేళ వారు చేస్తున్న పోరాటంలో నిజాయతీ ఉంటే, ప్రధాని మోదీ అపాయింట్ మెంట్ తీసుకుని ఆయనతో మాట్లాడాలని చెప్పారు. సమైక్యాంధ్ర ఉద్యమం లాగానే ప్రత్యేక హోదా అంశంపై కూడా రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.

సాక్షాత్తు వెంకటేశ్వరస్వామి సాక్షిగా ఇచ్చిన హామీలను కూడా మోదీ తుంగలో తొక్కారని మండిపడ్డారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం కానుమోలు గ్రామంలో ఈ ఉదయం మీడియాతో మాట్లాడుతూ, ఆయన పైవ్యాఖ్యలు చేశారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు చింతల వెంకటశివఅప్పారావు నివాసంలో ఆయన మీడియాతో ముచ్చటించారు.

raghuveera reddy
special status
Narendra Modi
Telugudesam
YSRCP
  • Loading...

More Telugu News