Chandrababu: ఈ రెండు పార్టీల నేతలను చంద్రబాబు కలవడం లేదు: గల్లా జయదేవ్

  • జాతీయ పార్టీల నేతలతో చంద్రబాబు భేటీ కారు
  • బీజేపీ, కాంగ్రెస్ లు ఏపీని ఎలా వంచించాయో వివరించనున్నారు
  • ఫెడరల్ వ్యవస్థను కేంద్రం ఎలా నాశనం చేస్తోందో చర్చించనున్నారు

రాష్ట్ర హక్కులను సాధించుకునే క్రమంలో, కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీకి వచ్చారని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. నిన్న రాత్రి చంద్రబాబు ఢిల్లీ చేరుకున్నారని... ఈరోజు పార్లమెంటులో అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లను ఆయన కలుస్తారని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ లకు చెందిన ఏ ఒక్క నాయకుడితో ఆయన భేటీ కాబోరని తెలిపారు. ఈ రెండు పార్టీలను మినహాయించి ఇతర అన్ని పార్టీల నేతలో బాబు సమావేశమవుతారని చెప్పారు.

ఈ సందర్భగా బీజేపీ, కాంగ్రెస్ లు ఏపీని ఏ విధంగా వంచించాయో చంద్రబాబు వివరించనున్నారని... రాష్ట్ర విభజన ఎలా జరిగింది, 2014 ఎన్నికల తర్వాత విభజన హామీలకు బీజేపీ ఎలా తూట్లు పొడిచిందో తెలియజేయనున్నారని వెల్లడించారు. ఫెడరల్ వ్యవస్థను కేంద్రం ఎలా నాశనం చేస్తోందో చర్చించనున్నారని చెప్పారు.

Chandrababu
galla jayadev
parliament
opposition parties
  • Loading...

More Telugu News