Chandrababu: మోదీని చంద్రబాబు విమర్శిస్తే.. విజయసాయిరెడ్డికి నొప్పి ఎందుకు?: ఎమ్మెల్యే ఆంజనేయులు

  • బీజేపీ నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి
  • చంద్రబాబును విమర్శించే స్థాయి విజయసాయికి లేదు
  • వైసీపీ లాలూచీ రాజకీయాలు ప్రజలందరికీ తెలుసు

ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో అడుగుపెట్టడంతో, బీజేపీ నేతల గుండెల్లో దడ పుడుతోందని టీడీపీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. వారి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని చెప్పారు. ఈ ఉదయం ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ, బీజేపీ డైరెక్షన్ లోనే వైసీపీ అధినేత జగన్ నడుస్తున్నారని ఆరోపించారు.

ఏపీకి అన్యాయం చేసిన ప్రధాని మోదీపై చంద్రబాబు విరుచుకుపడితే... వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి నొప్పి ఎందుకని ప్రశ్నించారు. చంద్రబాబు స్థాయికి విజయసాయిరెడ్డి సరితూగరని.. సీఎంను విమర్శించే స్థాయి ఆయనకు లేదని చెప్పారు. ప్రధానిని అవమానించారంటూ చంద్రబాబుపై విజయసాయిరెడ్డి సభాహక్కుల నోటీసు ఇవ్వడం వెనుక ఉన్న అంతరార్థం ప్రజలందరికీ తెలుసని అన్నారు. ప్రత్యేక హోదా కోసం అందరూ పోరాడుతున్న తరుణంలో... ఇలాంటి నీచమైన లాలూచీ రాజకీయాలు ఏమిటని మండిపడ్డారు.

Chandrababu
Narendra Modi
Vijay Sai Reddy
delhi tour
BJP
  • Loading...

More Telugu News