Chandrababu: ఢిల్లీలో అల్పాహార విందు.. కాసేపట్లో పార్లమెంటులో అడుగుపెట్టనున్న చంద్రబాబు

  • టీడీపీ ఎంపీలకు అల్పాహార విందు ఇచ్చిన చంద్రబాబు
  • పార్లమెంటు సెంట్రల్ హాల్లో వివిధ పార్టీల నేతలతో భేటీ
  • బీజేపీ అన్యాయాన్ని వివరించనున్న సీఎం

రాష్ట్ర హక్కులను సాధించుకునే క్రమంలో ఇతర పార్టీల మద్దతును కూడగట్టి, కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. నిన్న సాయంత్రం ఆయన ఢిల్లీ చేరుకున్నారు. ఈ ఉదయం ఏపీ భవన్ లో టీడీపీ ఎంపీలకు ఆయన అల్పాహార విందు ఇచ్చారు. సమావేశానికి సీఎం రమేష్, బుట్టా రేణుక, సీతారామలక్ష్మి, గల్లా జయదేవ్, తోట నరసింహం, రామ్మోహన్ నాయుడు, రవీంద్రబాబు, మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్లమెంటులో ఎలాంటి వ్యూహాన్ని అమలు చేయాలి... ఏయే పార్టీల నేతలను కలవాలి? అనే విషయాలపై ఎంపీలకు చంద్రబాబు మార్గనిర్దేశం చేశారు.

కాసేపట్లో చంద్రబాబు పార్లమెంటుకు చేరుకోనున్నారు. పార్లమెంటు సెంట్రల్ హాల్లో ఆయన వివిధ పార్టీల నేతలతో భేటీ కానున్నారు. ప్రత్యేక హోదాపై రూపొందించిన వివరణ పత్రాలను అన్ని పార్టీల నేతలకు అందజేస్తారు. ఏపీకి బీజేపీ చేసిన అన్యాయాన్ని వివరించనున్నారు. అయితే, కాంగ్రెస్ నేతలతో ఆయన భేటీ అవుతారా? లేదా? అనే విషయంలో మాత్రం సందిగ్ధత నెలకొంది. 

Chandrababu
parliament
special status
  • Loading...

More Telugu News