Mahendra singh dhoni: ఏప్రిల్ 2న దేశానికి ప్రపంచకప్ అందించిన ధోనీ.. అదే రోజున పద్మభూషణ్ అందుకున్న వైనం!

  • 2 ఏప్రిల్ 2011న భారత్‌కు ప్రపంచకప్ అందించిన ధోనీ
  • అదే రోజున రాష్ట్రపతి చేతుల మీదుగా పౌర పురస్కారం
  • కపిల్‌దేవ్ తర్వాత పద్మభూషణ్ అందుకున్నది ధోనీనే

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ సోమవారం (ఏప్రిల్ 2) రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా మూడో అత్యున్నత పౌరపురస్కారమైన పద్మభూషణ్‌ను  అందుకున్నారు. యాదృచ్ఛికంగా 2011లో అదే రోజున ధోనీ సారథ్యంలోని భారత జట్టు ప్రపంచకప్‌ను గెలుచుకుంది. 2, ఏప్రిల్ 2011న శ్రీలంకతో జరిగిన ఫైనల్‌లో బౌలర్ తలపై నుంచి అద్భుతమైన సిక్సర్ కొట్టిన ధోనీ భారత్‌కు రెండో ప్రపంచకప్‌ను అందించాడు.

ధోనీ సారథ్యంలోని భారత జట్టు రెండు ప్రపంచకప్‌లు గెలుచుకుంది.  సెప్టెంబరు 2007లో జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచకప్‌‌ను గెలుచుకున్న భారత్, 2011లో వన్డే ప్రపంచకప్‌ను ముద్దాడింది. కాగా, ధోనీ ప్రపంచకప్  సాధించిన రోజును గుర్తు చేసుకుంటూ బీసీసీఐ నాటి వీడియోను ట్విట్టర్‌లో పోస్టు చేసి నాటి మధుర స్మృతులను గుర్తు చేసింది. కాగా, మాజీ  కెప్టెన్ కపిల్ దేవ్ తర్వాత ఈ పురస్కారాన్ని అందుకున్న రెండో క్రికెటర్ ధోనీనే. ఆరుసార్లు ప్రపంచ బిలియర్డ్స్ టైటిల్ నెగ్గిన పంకజ్ అద్వానీ కూడా రాష్ట్రపతి చేతుల మీదుగా సోమవారం పద్మభూషణ్ అవార్డును అందుకున్నారు.

  • Loading...

More Telugu News