petrol: నాలుగేళ్ల గరిష్ట స్థాయికి చేరిన పెట్రోల్, డీజిల్ ధరలు!

  • ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 73.83
  • లీటర్ డీజిల్ ధర రూ. 64.69
  • గత జనవరి నుంచి 4 శాతం పెరిగిన ధరలు  

పెట్రోల్, డీజిల్ ధరలను ప్రతి రోజూ సమీక్షించుకునే విధానం అమల్లోకి వచ్చిన తర్వాత... మనకు ఏ మాత్రం తెలియకుండానే వాటి ధరలు అమాంతం పెరుగుతూ వస్తున్నాయి. ఈరోజు వీటి ధరలు నాలుగేళ్ల గరిష్ట స్థాయిని తాకాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 73.83కు చేరగా, డీజిల్ ధర రూ. 64.69కి పెరిగింది.

ఈరోజు లీటర్ పెట్రోల్ ధర 10 పైసలు, డీజిల్ ధర 11 పైసలు ఎగబాకాయి. 2014 సెప్టెంబర్ 14 తర్వాత ఇంత స్థాయికి పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం ఇదే ప్రథమం. గత జనవరి నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు 4 శాతం పెరిగాయి. వీటి ధరలు నాలుగేళ్ల గరిష్టానికి పెరిగిన నేపథ్యంలో, వీటిపై ఉన్న ఎక్సైజ్ డ్యూటీని ఎత్తివేయాలనే డిమాండ్లు ఊపందుకుంటున్నాయి.

petrol
diesel
rates
  • Loading...

More Telugu News