Congress: ‘సత్యమేవ జయతే’ దీక్ష‌ విజ‌య‌వంతమైంది!: రఘువీరారెడ్డి

  • రిలే నిర‌హార దీక్ష‌కు 84 ప్ర‌జా సంఘాలు మ‌ద్ద‌తు తెలిపాయి
  • రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ దీక్ష‌లు జ‌రుగుతాయి
  • హోదా సాధించే వరకు ‘కాంగ్రెస్’ రాజీ లేని పోరాటం చేస్తుంది

ఆంధ్ర‌ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ అధ్వ‌ర్యంలో విజ‌యవాడ ధ‌ర్నాచౌక్‌లో ఈరోజు ఉద‌యం ‘సత్యమేవజయతే’ దీక్షను ర‌ఘువీరారెడ్డి ప్రారంభించి, రిలే నిరా‌హార దీక్ష‌లో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ, పార్లమెంటులో అవిశ్వాసంపై చర్చ జరపాలని, ఏపీకి ప్రత్యేక హోదా, ఇచ్చిన హామీలు, విభజన చట్టంలోని అంశాలన్నీ అమలు చేయాల‌నే ప్ర‌ధాన డిమాండ్లతో ఈ దీక్ష చేపట్టినట్టు చెప్పారు.

దాదాపు 84 ప్ర‌జా సంఘాల మద్ద‌తుతో సత్యమేవజయతే దీక్ష విజ‌య‌వంతమైందని, రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ దీక్ష‌లు జ‌రుగుతాయ‌ని అన్నారు. హోదా అమలయ్యే వరకు కాంగ్రెస్ పార్టీ రాజీ లేని పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదాపై ఈ పార్లమెంటు సమావేశాల్లోగా మోదీ ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోతే ఇవ్వనట్లేనని అన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమం తీరులోనే టీడీపీ, వైసీపీ లు హోదా ఉద్యమాన్ని రాజకీయం చేయడానికే ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. లోక్ సభలో అన్నాడీఎంకే సభ్యులతో నిరసన చేయిస్తోంది బీజేపీయేనని, అవిశ్వాసం తీర్మానంపై సమాధానం చెప్పే ధైర్యం లేక బీజేపీ పారిపోతోందని వ్యాఖ్యానించారు. 2019లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ అధికారంలోకి రాగానే ఏపీకి హోదా అమలు చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చిన విషయాన్ని రఘువీరారెడ్డి ప్రస్తావించారు. అనంతరం, కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు మాట్లాడుతూ, ఈ నెల 3 నుంచి 6వ తేదీ వరకు ఏపీ వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలు జ‌రుగుతాయని, జాతీయ పార్టీగా తాము చేయాల్సిన పోరాటం చేస్తున్నామని చెప్పారు.

 రాజ‌కీయంగా చంద్ర‌బాబు త‌ప్పు చేశారు : సీపీఎం కార్యదర్శి మధు

ప్రత్యేక హోదా కోసం పోరాటం చేసిన ప్రతి పార్టీ నాయకుల్ని అరెస్ట్ చేసిన తెలుగుదేశం పార్టీ, చంద్ర‌బాబు రాజ‌కీయంగా త‌ప్పు చేశారని రిలే నిరాహార దీక్షకు మ‌ద్ద‌తు తెలిపిన ఏపీ సీపీఎం కార్య‌ద‌ర్శి మధు అన్నారు. రాష్ట్రంలో చేసిన ప్రతి పనినీ బీజేపీని అడిగే చంద్రబాబు చేశారని, అందుకు పూర్తి బాధ్యత ఆయనదేనని అన్నారు.   

  • Loading...

More Telugu News