ipl: ఐపీఎల్ ప్రారంభ వేడుకలకు రణ్ వీర్ సింగ్ రావడం లేదు!

  • ఐపీఎల్ ప్రారంభ వేడుకలకు దూరమైన రణ్ వీర్ సింగ్
  • రణ్ వీర్ స్థానంలో వరుణ్ ధావన్
  • వరుణ్ ప్రదర్శనకు 6 కోట్ల రెమ్యూనరేషన్?

ఏప్రిల్ 7న ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరగనున్న ఐపీఎల్ సీజన్ 11 వేడుకలకు ప్రముఖ సినీ నటుడు రణ్ వీర్ సింగ్ దూరమయ్యాడు. ఫుట్‌ బాల్‌ మ్యాచ్‌ ఆడుతూ కిందపడిన రణ్ వీర్ గాయపడ్డాడు. దీంతో అతని భుజానికి గాయం కాగా, వైద్యులు నెల రోజుల విశ్రాంతి సూచించారు. దీంతో ఐపీఎల్ ప్రారంభ వేడుకలకు రణ్ వీర్ దూరమయ్యాడు.

ఐపీఎల్ ప్రారంభ వేడుకల్లో బాలీవుడ్ స్టార్స్ వరుణ్‌ ధావన్‌, జాక్వలైన్‌ ఫెర్నాండెజ్‌, పరిణతి చోప్రా తదితరులు ప్రదర్శన ఇవ్వనున్నారు. ఈ వేడుకలు ముగిసిన అనంతరం ముంబై ఇండియన్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. ఈ వేడుకల్లో ప్రదర్శన ఇచ్చేందుకు వరుణ్ ధావన్ 6 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అడిగినట్టు బీటౌన్ కథనాలు చెబుతున్నాయి. 

ipl
Cricket
bcci
ranveer singh
varun dhavan
  • Loading...

More Telugu News