gali janardhan reddy: గాలి జనార్దన్ రెడ్డికి షాక్ ఇచ్చిన అమిత్ షా

  • బీజేపీతో గాలికి సంబంధం లేదన్న అమిత్ షా
  • రాజకీయ పున:ప్రవేశానికి సిద్ధమవుతున్న వేళ షాక్
  • జీర్ణించుకోలేకపోతున్న గాలి వర్గీయులు

అక్రమ మైనింగ్ కేసులో రెండున్నర ఏళ్లకు పైగా జైలు జీవితం గడిపి బయటకు వచ్చిన గాలి జనార్దన్ రెడ్డికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా షాక్ ఇచ్చారు. రాజకీయ పున:ప్రవేశానికి ఆయన సిద్ధమతున్న వేళ... ఆయన ఆశలపై నీళ్లు చల్లారు. గాలా జనార్దన్ రెడ్డికి బీజేపీతో ఎలాంటి సంబంధం లేదని ఆయన ప్రకటించారు.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం కోసం అలుపెరుగకుండా కృషి చేస్తున్న గాలికి అమిత్ షా ప్రకటన షాక్ ఇచ్చింది. గాలి అనుచరులకు అమిత్ ప్రకటన మింగుడు పడటం లేదు. పార్టీ అధ్యక్షుడి నుంచే ఇలాంటి ప్రకటన రావడాన్ని జీర్ణించుకోవడం లేదు. ఇది గాలి వర్గానికి పెద్ద కుదుపేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

gali janardhan reddy
amit shah
BJP
  • Loading...

More Telugu News