Vijay Sai Reddy: విజయ్ మాల్యాను లండన్లో చంద్రబాబు కలిశారు.. 150 కోట్లు తీసుకున్నారు: విజయసాయిరెడ్డి

  • మాల్యాను కలిసిన విషయంపై చంద్రబాబు స్పందించాలి
  • రాజకీయలబ్ధి కోసమే చంద్రబాబు ఢిల్లీకి వస్తున్నారు
  • బాబుపై సభా హక్కుల నోటీసులు ఇచ్చాం

బ్యాంకులను రూ. 9వేల కోట్ల మేర ముంచేసి లండన్ చెక్కేసిన విజయ్ మాల్యాతో తనను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలుస్తున్నారని వైసీ ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. 2016 మార్చిలో మాల్యాను లండన్ లో చంద్రబాబు కలిశారని ఆరోపించారు. పార్టీ కోసం రూ. 150 కోట్ల విరాళం తీసుకున్నారని చెప్పారు. ఈ విషయంపై చంద్రబాబు స్పందించాలని డిమాండ్ చేశారు. స్పందించకపోతే తాను చేసిన ఆరోపణలు నిజమే అని నమ్మాల్సి వస్తుందని చెప్పారు.

 చంద్రబాబు ఢిల్లీ వస్తున్నది కూడా రాజకీయ లబ్ధకోసమేనని అన్నారు. మరోసారి అధికారంలోకి వచ్చే ప్రయత్నాలను చంద్రబాబు మొదలు పెట్టారని... అయితే గత నాలుగేళ్లుగా మోసం చేస్తున్న చంద్రబాబును ప్రజలు నమ్మరని చెప్పారు. ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో చంద్రబాబుపై సభాహక్కుల నోటీసులు ఇచ్చామని తెలిపారు.

Vijay Sai Reddy
Chandrababu
vijay mallya
Narendra Modi
  • Loading...

More Telugu News