ntr: 'రంగస్థలం' చూశాను .. చరణ్, నీకు హ్యాట్సాఫ్!: ఎన్టీఆర్

  • చరణ్ అద్భుతంగా నటించావ్ 
  • చిట్టిబాబు పాత్రలో మెప్పించావ్ 
  • ఇంతకన్నా గొప్పగా ఎవరూ చేయలేరు 

'రంగస్థలం' సినిమాపై చరణ్ పెట్టుకున్న నమ్మకం నిజమైంది. తన అభిమానులకు ఓ భారీ విజయాన్ని కానుకగా ఇవ్వాలనే ఆయన ప్రయత్నం ఫలించింది. ఈ సినిమా చూసి సాధారణ ప్రేక్షకులు మాత్రమే కాదు .. ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు కూడా చరణ్ నటనకి కితాబునిస్తున్నారు. తాజాగా ఆ జాబితాలో ఎన్టీఆర్ కూడా చేరిపోయాడు.

 "ఇప్పుడే రంగస్థలం చూశాను .. చరణ్, నీకు హ్యాట్సాఫ్ చెబుతున్నాను. ఇప్పుడు నీకు దక్కుతోన్న ఈ ప్రశంసలకు నువ్వు పూర్తిగా అర్హుడివి. 'చిట్టిబాబు' పాత్రకి గౌరవం తెచ్చావ్. ఈ పాత్రను ఇంతకంటే బాగా ఎవరూ చేయలేరు" అంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు.  'థ్యాంక్యూ బ్రదర్' అంటూ చరణ్ అందుకు బదులిచ్చాడు.

అన్నట్టు, మొదటి నుంచీ కూడా ఎన్టీఆర్ .. చరణ్ లమధ్య మంచి సాన్నిహిత్యం వుంది. త్వరలో ఈ ఇద్దరూ కలిసి ఒక మల్టీ స్టారర్ చేయనున్నారు కూడా. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ఇలా ట్వీట్ చేయడం ఇద్దరి అభిమానులకు ఆనందాన్ని కలిగించే విషయం.     

  • Loading...

More Telugu News