wether: 'ఈ ఏడాది కూడా ఎండలు మండుతాయి.. జాగ్రత్త' అంటున్న వాతావరణ శాఖ
- 2017ను అత్యంత వేడి సంవత్సరంగా గుర్తిస్తున్నట్టు పేర్కొన్న ఐఎండీ
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు
- దేశవ్యాప్తంగా పెరగనున్న ఉష్ణోగ్రతలు
ఈ ఏడాది దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఏప్రిల్-జూన్ మధ్యకాలంలో సగటు ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా అధికంగా నమోదవుతాయని వాతావరణ విభాగం (ఐఎండీ) హెచ్చరికలు జారీ చేసింది. కోస్తాంధ్ర, ఒడిశా, తెలంగాణల్లో సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ పేర్కొంది.
ఈ మూడు రాష్ట్రాల్లో అప్పుడప్పుడు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. రుతుపవనాలు సరైన సమయంలో వస్తాయని చెప్పేందుకు ఇది చక్కని ఉదాహరణ అని పేర్కొంది. ఉత్తరభారత దేశంలో ప్రతి ఏడు మాదిరిగానే ఈ ఏడాది కూడా ఎండలు మండిపోతాయని చెప్పింది. 2017ను అత్యంత వేడి సంవత్సరంగా గుర్తిస్తున్నట్టు తెలిపింది. అయితే 2017 ఎండలతో పోలిస్తే ఈ ఏడాది ఎండలు తక్కువగా ఉంటాయని జాతీయ వాతవరణ శాఖ వెల్లడించింది.