న్యూస్ యాంకర్ రాధిక ఆత్మహత్య వార్త విని షాక్ అయిన రష్మీ గౌతమ్
- వీ6 యాంకర్ రాధికారెడ్డి మరణంపై ఆవేదన వ్యక్తం చేసిన రష్మీ
- ఆత్మహత్య చేసుకున్నంత మాత్రాన బాధలు పోవంటూ ట్వీట్
- ఉదయాన్నే ఆత్మహత్యల వార్తలు చూడటం బాధను కలిగిస్తుంది
రాధికను తాను ఎప్పుడూ కలవనప్పటికీ... ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని తెలిపింది. ఈ రోజుల్లో డిప్రెషన్ అనేది అతి పెద్ద సమస్యగా పరిణమించిందని చెప్పింది. ఎప్పుడైనా అప్ సెట్ అయినప్పుడు కుటుంబసభ్యులు, స్నేహితులతో గడపాలని సూచించింది. ఉదయాన్నే ఆత్మహత్యలకు సంబంధించిన వార్తలు చూడటం ఎంతో బాధను కలిగిస్తుందని చెప్పింది.