Chandrababu: చంద్రబాబుతో పరిటాల సునీత భేటీ.. కూతురు పెళ్లికి ఆహ్వానం!

  • కుమార్తె వివాహానికి చంద్రబాబును ఆహ్వానించిన సునీత
  • స్నేహలతకు శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి
  • మే 6న వెంకటాపురంలో పెళ్లి వేడుక

ముఖ్యమంత్రి చంద్రబాబును మంత్రి పరిటాల సునీత కలిశారు. తమ కుమార్తె స్నేహలత వివాహానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పెళ్లికూతురు స్నేహలతకు చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. మే 6వ తేదీన పరిటాల రవి స్వగ్రామమైన వెంకటాపురంలో స్నేహలత వివాహం జరగనుంది. పెళ్లికుమారుడి పేరు హర్ష.  పరిటాల రవీంద్ర సోదరి వడ్లమూడి శైలజ కుమారుడు హర్ష. మంచి బిజినెస్ మేన్ గా హర్ష గుర్తింపు తెచ్చుకున్నారు. స్నేహలత ఎండీ పూర్తి చేశారు. ఇటీవలే వీరి ఎంగేజ్ మెంట్ వెంకటాపురంలో అంగరంగ వైభవంగా జరిగింది. 

Chandrababu
paritala sunitha
paritala ravi
daughter
marriage
snehalatha
  • Loading...

More Telugu News