Congress: హిట్లర్, తుగ్లక్ తో పోల్చదగిన వ్యక్తి మోదీ : కాంగ్రెస్ నేత తులసిరెడ్డి

  • అపరిచితుడు వ్యక్తిత్వానికి మోదీ సరిగ్గా సరిపోతారు
  • ప్రజాస్వామిక నియంత మోదీ
  • మోదీ మాటలకు, చేతలకు ఎక్కడా పొంతన లేదు

హిట్లర్, తుగ్లక్ తో పోల్చదగిన వ్యక్తి మోదీ అంటూ కాంగ్రెస్ నేత తులసిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, అపరిచితుడు వ్యక్తిత్వానికి మోదీ సరిగ్గా సరిపోతారని, ప్రజాస్వామిక నియంత మోదీ అని, ఎల్లకాలం ఒకరే పాలించాలంటే సాధ్యం కాదని అన్నారు. మోదీపై  వ్యక్తిత్వ వికాస నిపుణుడు సి.నరసింహారావు చేసిన విశ్లేషణపై కాంగ్రెస్ పార్టీ లోతుగా చర్చిస్తుందని, మోదీ మాటలకు, చేతలకు ఎక్కడా పొంతన లేదని అన్నారు. హిందువులు, ముస్లింలను రెచ్చగొట్టడం తప్ప మోదీకి ఎందులోనూ పరిజ్ఞానం లేదని, వ్యవసాయం ఎలా చేయాలి, అభివృద్ధి ఎలా సాధించాలనే తెలివితేటలు ఆయనకు లేవని విమర్శించారు. యుగానికో రాక్షసుడు ఉండేవాడని, అన్ని యుగాల రాక్షసులకు మోదీ సమానమంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Congress
tulasi reddy
  • Loading...

More Telugu News