CPI Narayana: వందేమాతరం శ్రీనివాస్ పాట.. కార్యకర్తలతో సీపీఐ నారాయణ కోలాటం!

  • హైదరాబాద్ లో సీపీఐ రాష్ట్ర మహాసభలు ప్రారంభం
  • మహిళా కార్యకర్తలతో కోలాటమాడిన నారాయణ, చాడ
  • ఈ నెల 4 వరకు జరగనున్న మహాసభలు

‘పల్లె మనదిరా ప్రతి పనికి మనంరా..’ అంటూ వందేమాతరం శ్రీనివాస్ పాడిన పాటకు సీపీఐ నారాయణ, చాడ వెంకటర్ రెడ్డి కోలాటం ఆడారు. సభా వేదికపై కార్యకర్తలతో నారాయణ కోలాటం ఆడి వారిలో జోష్ పెంచారు. హైదరాబాద్ లో నేటి నుంచి సీపీఐ రాష్ట్ర మహాసభలు ప్రారంభమయ్యాయి. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో బహిరంగ సభ జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వేదికపై మహిళా కార్యకర్తలతో కలిసి నారాయణ కోలాటం ఆడారు. ఆ తర్వాత, నారాయణ, చాడ వెంకటరెడ్డి  కోలాటం ఆడి అందరినీ నవ్వుల్లో ముంచెత్తారు.

CPI Narayana
Hyderabad
  • Loading...

More Telugu News