Ramcharan: విజయానందంలో ఉన్న చరణ్‌కి సూపర్‌స్టార్ మహేశ్ భార్య గిఫ్ట్

  • సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతోన్న రంగస్థలం చిత్రం
  • తొలి రోజు కలెక్షన్లు దాదాపు రూ.40 కోట్ల పైమాటే!
  • వారం రోజుల్లో రికార్డులు సృష్టిస్తుందని అంచనా

దర్శకుడు సుకుమార్-మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్‌లో వచ్చిన 'రంగస్థలం' చిత్రం సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతోంది. అందులో నటనకు చరణ్‌ను తన కుటుంబసభ్యులు, బంధుమిత్రులతో పాటు పలువురు సినీ నటులు కూడా మెచ్చుకుంటున్నారు. కొందరైతే బహుమతులిచ్చి మరీ ప్రశంసిస్తుండటం గమనార్హం.

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్‌ చరణ్‌ని కలిసి ఓ గిఫ్ట్ ఇచ్చింది. అయితే అదేంటనేది తెలియడం లేదని సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఆ ఫొటోని చూసిన నెటిజన్లు ట్వీట్ చేస్తున్నారు. ఈ సినిమా తొలి రోజు కలెక్షన్లు అనూహ్య రీతిలో దాదాపు 40 కోట్ల రూపాయలను దాటేశాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. రానున్న వారం రోజుల్లో కలెక్షన్ల పరంగా ఇది రికార్డు సృష్టించనుందని వారు విశ్లేషిస్తున్నారు.

Ramcharan
Namratha Sirodkar
Mahesh Babu
Rangasthalam
Gift
  • Loading...

More Telugu News