amaravathi: 5న ‘ఎవరి రాజధాని అమరావతి?’ పుస్తకం ఆవిష్కరిస్తా : ఐవైఆర్ కృష్ణారావు
- టీడీపీ సహా అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానించా
- ఏపీకి కేంద్రం రూ.75 వేల కోట్లు ఇవ్వాలని జేఎఫ్సీ నివేదికలో లేదు
- తప్పంతా కేంద్రానిదే అనేందుకు వీలు లేదు
- మహారాజధాని నిర్ణయమే ఓ తప్పుడు కాన్స్పె ప్ట్
ఈ నెల 5న ‘ఎవరి రాజధాని అమరావతి?’ పుస్తకం ఆవిష్కరిస్తానని మాజీ ఐఏఎస్ అధికారి ఐవైఆర్ కృష్ణారావు వెల్లడించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి టీడీపీ సహా అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానించానని చెప్పారు. తాను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)గా ఉన్నసమయంలోనే రాజధాని అమరావతిపై తనకు కొన్ని అభిప్రాయాలు ఉన్నాయని చెప్పారు.
ఈ సందర్భంగా జేఎఫ్సీ నివేదిక గురించి ఆయన ప్రస్తావించారు. ఏపీకి కేంద్రం రూ.75 వేల కోట్లు ఇవ్వాలని ఆ నివేదికలో చెప్పలేదని, తప్పంతా కేంద్రానిదే అనేందుకు వీలు లేదని, ఏపీకి కేంద్రం అంత గొప్పగా చేయకపోయినప్పటికీ తీసేసే పరిస్థితి మాత్రం లేదని అభిప్రాయపడ్డారు. మహారాజధాని నిర్ణయమే ఓ తప్పుడు కాన్స్పె ప్ట్ అని, నిధులన్నీ రాజధానికే అనే ఆలోచనతో చెడు ఫలితలు వస్తాయని, కేంద్ర ప్రభుత్వం ఏమీ ఇవ్వలేదన్న వాదనతో తాను ఏకీభవించనని అన్నారు.