New Delhi: రెండు గంటల పాటు యాచకుడిగా మారి ప్రయోగం... ఎంత సంపాదించాడో, వీడియో చూడండి!

  • ఢిల్లీ గ్రాడ్యుయేట్ ప్రయోగం
  • రెండు గంటల్లో రూ. 200 సంపాదన
  • వైరల్ అయిన వీడియో

ఏదైనా కూడలి వద్ద వాహనాన్ని ఆపితే, చిరిగిన బట్టలు, చెదిరిన జుట్టుతో చేతికో, కాలికో కట్టుతో వచ్చి కార్ల అద్దాలు తడుతూ రూపాయో, రెండు రూపాయలో ఇవ్వాలని అడుక్కునే వారిని నిత్యమూ చూస్తూనే ఉంటాము. ఒక్కోసారి వీరి సంపాదన ఎంత ఉంటుందన్న అనుమానం కూడా వస్తుంది. ఇక అదే అనుమానం వచ్చిన ఓ ఢిల్లీ గ్రాడ్యుయేట్, కాసేపు భిక్షాటన చేశాడు. నెల రోజుల పాటు అతను ఉద్యోగం చేస్తే వచ్చే జీతం రూ. 15 వేలు. అంటే రోజు మొత్తం పనిచేస్తే వచ్చేది రూ. 500. ఇక మాసిన బట్టలు వేసుకుని, చేతికో కట్టు కట్టుకుని అదే యువకుడు, దీనంగా తిరుగుతూ, భిక్షాటన చేస్తే రెండు గంటల్లో  ఎంత వచ్చాయో తెలుసా? రూ. 200.

రోజుకు పది గంటలు కష్టపడి నెలకు రూ. 30 వేలు పొందే ఉద్యోగి ఒక రోజు సంపాదనను ఇతను పొందగలడన్నమాట. ఇక జేబులో కెమెరా పెట్టుకుని ఇతను అడుక్కోవడం, దాన్ని అతని మిత్ర బృందం వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది వైరల్ అయి, దాదాపు 30 లక్షల వ్యూస్ తెచ్చుకుంది. వీడియో పాతదే అయినా, ఇండియాలో యాచకుల సంపాదన ఎలా ఉంటుందనడానికి నిదర్శనమైన వీడియోను మీరూ చూడండి.

New Delhi
Begger
Graduate
  • Error fetching data: Network response was not ok

More Telugu News