Smith: కుంగిపోయిన స్టీవ్ స్మిత్‌కు రాజస్థాన్ రాయల్స్ గుడ్ న్యూస్....!

  • స్మిత్‌ని వదులుకోమని ప్రకటన
  • వచ్చే సీజన్‌లో అవకాశమిస్తామని వెల్లడి
  • ఈ నెల 7 నుంచి ఐపీఎల్ టోర్నీ మొదలు

బాల్ ట్యాంపరింగ్ పాపానికి ఏడాది పాటు నిషేధానికి గురైన ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ స్టీవ్ స్మిత్‌ చివరికి ఈ ఏడాది ఐపీఎల్ మెగా టోర్నీలోనూ ఆడే అవకాశాన్ని కోల్పోయాడు. ఐపీఎల్‌లో అతను రాజస్థాన్ రాయల్స్ జట్టు తరపున ఆడుతున్న సంగతి తెలిసిందే. నిషేధం నేపథ్యంలో అతను ఆ జట్టు కెప్టెన్ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) తనని ఏడాది పాటు సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్న తర్వాత స్మిత్ సిడ్నీలో నిర్వహించిన మీడియా సమావేశంలో తనను క్షమించండంటూ చిన్నపిల్లాడిలా వెక్కి వెక్కి ఏడ్చేశాడు.

మానసికంగా కుంగిపోయిన స్థితిలో ఉన్న స్మిత్‌కి రాజస్థాన్ రాయల్స్ జట్టు శుభవార్త వినిపించింది. అతన్ని తాము వదులుకునే ప్రసక్తేలేదని, అతనిపై నిషేధం వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్‌కి ముందే ముగిసిపోతుందని, అందువల్ల అతను వచ్చే సీజన్‌లో తమ జట్టు తరపున ఆడగలడంటూ ఓ అధికారిక ప్రకటన ద్వారా వెల్లడించింది. ఈ సీజన్‌లో రాజస్థాన్ కెప్టెన్‌గా స్మిత్ స్థానంలో అజింక్యా రెహానె, సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ సారథిగా వార్నర్ స్థానంలో కేన్ విలియమ్సన్ బాధ్యతలు చేపడుతున్నారు. ఈ నెల 7 నుంచి ఐపీఎల్ టోర్నీ ప్రారంభమవుతోంది.

Smith
Warner
IPL
CA
Sunrisers Hyderabad
Rajasthan Royals
  • Loading...

More Telugu News