Saira: చిరంజీవి సినిమాతో మళ్లీ నరకం కనిపిస్తోంది: అమితాబ్ బచ్చన్

  • గతంలో పెట్టుడు గడ్డం, విగ్గు వద్దనుకున్నా
  • 'సైరా' కోసం తప్పలేదు
  • నరకాన్ని అనుభవిస్తున్నట్టు ఉంది

గతంలో తాను ఏదైతే చేయకూడదని వాగ్దానం చేసుకున్నానో చిరంజీవి 'సైరా' చిత్రం కోసం దాన్ని మీరాల్సి వచ్చిందని బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఓ ఆసక్తికర అంశాన్ని తన బ్లాగ్ ద్వారా పంచుకున్నారు. ఏ సినిమాలో కూడా విగ్గు, గడ్డం పెట్టుకుని నటించరాదని తాను గతంలో అనుకున్నానని, ఇప్పుడు 'సైరా' కోసం తిరిగి విగ్గు పెట్టుకోవాల్సి వచ్చిందని, గడ్డం తగిలించుకున్నానని అన్నారు.

దీంతో తన సినీ జీవితంలో మరోసారి నరకాన్ని అనుభవిస్తున్నట్టు అనిపిస్తోందని అన్నారు. ఇదే సమయంలో వ్యక్తిగత అవసరాల రీత్యా కొన్నిసార్లు ఇటువంటివి తప్పవని వ్యాఖ్యానించారు. కాగా, నయనతార హీరోయిన్ గా, జగపతిబాబు, సుదీప్, విజయ్ సేతుపతి తదితరులు ముఖ్య పాత్రల్లో హీరో రామ్ చరణ్ నిర్మిస్తున్న చిత్రం షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతున్న సంగతి తెలిసిందే.

Saira
Amitabh Bachchan
Chiranjeevi
  • Loading...

More Telugu News