Baghi-2: భారత రాష్ట్రపతి ఎవరో తెలియని 'భాఘీ-2' హీరో... తెగ దెప్పిపొడుస్తున్న నెటిజన్లు... వీడియో చూడండి!

  • ప్రణబ్ ముఖర్జీ పేరు చెప్పిన టైగర్ ష్రాఫ్
  • ఏబీపీ న్యూస్ ఇంటర్వ్యూలో ఘటన
  • వైరల్ అవుతున్న వీడియో

సినీ నటీనటులకు తెలివితేటలు, లోకజ్ఞానం, సమకాలీన అంశాలపై పరిజ్ఞానం కాస్తంత తక్కువేనని నిరూపించిన వారి జాబితాలో యువ హీరో టైగర్ ష్రాఫ్ చేరిపోయాడు. అసలేం జరిగిందంటే, ఆయన నటించిన 'భాఘీ-2' దూసుకుపోతున్న వేళ, ఏబీపీ న్యూస్ నిర్వహించిన ఓ ప్రత్యేక ఇంటర్వ్యూకు తన స్నేహితురాలు, సినిమా హీరోయిన్ దిశా పఠానీతో కలసి హాజరయ్యాడు.

కాసేపు పిచ్చాపాటీ కబుర్లు, వ్యక్తిగత విషయాలపై ప్రశ్నల తరువాత, చానల్ యాంకర్ ఇండియాకు రాష్ట్రపతి ఎవరు? అని ప్రశ్నించింది. కాస్త కష్టమైన ప్రశ్నేనంటూ, టైగర్ ష్రాఫ్ 'మిస్టర్ ముఖర్జీ' అని సమాధానం ఇచ్చాడు. దీంతో అవాక్కైన యాంకర్, దిశా పఠానీకి అవకాశం ఇవ్వగా, ఆమె 'రామ్ నాథ్ కోవింద్' అని చెప్పింది. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా, టైగర్ తెలివితేటలను చూసిన నెటిజన్లు తెగ ఎద్దేవా చేసేస్తున్నారట. ఆ వీడియోను మీరూ చూడండి!

Baghi-2
Tiger Sharof
President Of India
Pranab Mukherjee
Ram Nath Kovind
  • Error fetching data: Network response was not ok

More Telugu News