Rajasthan: రాజస్థాన్ లో బద్దలైన మాల్ సిసర్ డ్యామ్!
- కిలోమీటర్ల కొద్దీ జలయమం
- నిలువెత్తు నీటిలో ఇళ్లు
- సహాయక చర్యలు ప్రారంభం
రాజస్థాన్ లోని మాల్ సిసర్ డ్యామ్ బద్దలైంది. దీంతో ఝుంఝును జిల్లా పరిధిలోని చాలా గ్రామాలు జలమయం అయ్యాయి. ముఖ్యంగా మాల్ సిసర్ పరిధిలోని గ్రామాలన్నీ ముంపునకు గురికాగా, ఆనకట్ట ఆయకట్టుగా ఉన్న వేలాది ఎకరాల పంట నీట మునిగింది. దాదాపు ఐదు కిలోమీటర్ల దూరం పాటు నీరు ప్రవహించగా, ప్రభుత్వ కార్యాలయాలు, ఇళ్లు నిలువెత్తు నీటిలో మునిగాయి. రంగంలోకి దిగిన రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలను ప్రారంభించారు. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు అధికారులు తెలిపారు. తొలుత చిన్న రంద్రం నుంచి నీళ్లు లీక్ అయ్యాయని, క్రమంగా అది పెద్దదైందని, చివరకు డ్యామ్ బద్దలైందని పేర్కొన్నారు.