Stephen Haking: స్టీఫెన్ హాకింగ్ కు కన్నీటి వీడ్కోలు.. ముగిసిన అంత్యక్రియలు
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-5fcdfdda94a82f49f6eeaae8823c4e8bc895cc78.jpg)
- కేంబ్రిడ్జ్ వర్శిటీలో అంత్యక్రియలు
- తరలి వచ్చిన అభిమానులు, శిష్యులు
- క్రైస్తవ పద్ధతిలో అంత్యక్రియలు
సుప్రసిద్ధ భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ అంత్యక్రియలు ముగిశాయి. వందలాది మంది అభిమానులు, శిష్యుల అశ్రునయనాల మధ్య లండన్ లో ఆయన అంత్యక్రియలు జరిగాయి. కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ ప్రాంగణంలోనే ఆయన పార్థివ దేహాన్ని ఖననం చేశారు. వర్శిటీ పరిధిలోని గాన్విలే అండ్ కయూస్ కళాశాల, సెయింట్ మేరీ చర్చ్ ల సమీపంలో హాకింగ్ శాశ్వతనిద్రకు ఉపక్రమించే ఏర్పాట్లు చేశారు. సంప్రదాయ క్రైస్తవ పద్ధతిలో అంత్యక్రియలు నిర్వహించారు.