Jagan: హోదా కోసం మా ఎంపీలు ఇక రాజీనామాలు చేస్తారు.. ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభిస్తారు: జ‌గ‌న్ ప్ర‌క‌ట‌న‌

  • హోదా కోసం టీడీపీ ఎంపీలు రాజీనామా చేయట్లేదు
  • చంద్రబాబుకి కేసుల భయం ఉంది 
  • వైసీపీ ఎంపీలకు బాసటగా ఏపీలో నిరసనలు
  • విద్యార్థులు పెద్ద ఎత్తున కదలిరావాలి

ఏపీలో ఉద్యోగాలు ఇస్తున్నామ‌ని చంద్ర‌బాబు నాయుడు అస‌త్యాలు చెబుతున్నార‌ని, రాజ‌ధాని నిర్మాణం అంటూ గ్రాఫిక్స్ చూపిస్తున్నార‌ని వైసీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఘాటుగా విమర్శించారు. ప్ర‌త్యేక హోదా విష‌యంలో చంద్ర‌బాబు క‌న‌బ‌రుస్తోన్న తీరు ఎలా ఉందో తెలుసా? అని ప్ర‌శ్నించారు. ఆస్కారు అవార్డులు ఇచ్చే వారు ఏపీకి వ‌చ్చి చంద్ర‌బాబు నాయుడిని చూస్తే ఉత్త‌మ విల‌న్ అవార్డును క‌చ్చితంగా ఆయనకు ఇచ్చేస్తారని చుర‌క‌లంటించారు.

ఈ రోజు గుంటూరు జిల్లా తాడికొండ నియోజ‌క వ‌ర్గం పేరేచెర్ల‌లో ఆయ‌న ర్యాలీలో మాట్లాడుతూ.. ప్ర‌త్యేక హోదా కోసం చంద్ర‌బాబు నాయుడు త‌మ ఎంపీల‌తో రాజీనామా చేయించ‌డం లేద‌ని, ఆయ‌న‌పై ఉన్న కేసుల భ‌యంతోనే ఇలా చేస్తున్నార‌ని ఆరోపించారు. టీడీపీ ఎంపీలు రాజీనామా చేసినా చేయ‌క‌పోయినా పార్ల‌మెంటు స‌మావేశాల చివ‌రి రోజున త‌మ ఎంపీలు రాజీనామా చేస్తార‌ని ప్ర‌క‌టించారు.

అనంత‌రం నేరుగా ఢిల్లీలోని ఏపీ భ‌వ‌న్‌కు వెళ్లి అక్కడే ఆమరణ నిరాహార దీక్షలు చేస్తారని, వారికి బాసటగా ఏపీలో ప్రతి నియోజక వర్గంలో నిరసనలు తెలపాలని, విద్యార్థులు పెద్ద ఎత్తున కదలిరావాలని పిలుపునిచ్చారు. యువతరం త‌మ దీక్ష‌కు సంఘీభావం తెలపాలని అన్నారు. 

  • Loading...

More Telugu News