India: చైనా సరిహద్దు వద్ద భారత బలగాల గస్తీ.. సవాళ్లు ఎదుర్కొనేందుకు సిద్ధమన్న ఆర్మీ

  • సరిహద్దుల్లో మ‌రోసారి అల‌జ‌డి
  • చైనా దూకుడు
  • చెక్‌ పట్టేందుకు భారత్ సిద్ధం

భార‌త్, చైనా సరిహద్దుల్లో మ‌రోసారి అల‌జ‌డి చెల‌రేగుతోంది. అరుణాచల్ ప్రదేశ్‌లోని ఆంజా జిల్లాలో చైనా టెలీకమ్యూనికేషన్ టవర్‌, అబ్జర్వేషన్ పోస్ట్‌లను ఏర్పాటు చేసినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో అరుణాచల్‌ ప్రదేశ్‌ సెక్టార్‌లోని పలు ప్రాంతాల వద్ద భారత్‌ బలగాల సంఖ్యను పెంచింది. తాజాగా భారత ఆర్మీ అధికారులు మాట్లాడుతూ... దిబాంగ్‌, డియో-డిలాయ్‌, లోహిత్‌ కొండ ప్రాంతాల వద్ద బలగాలు నిత్యం గస్తీ కాస్తున్నాయని, తాము ఎటువంటి సవాళ్లనయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

ఎల్‌ఏసీ వద్ద పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్నామని, పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని తెలిపారు. అలాగే భారత్‌, చైనా, మయన్మార్‌ ట్రై జంక్షన్ ప్రాంతంలోనూ బలగాల విస్తరణ చేశామని తెలిపారు. వీటితో పాటు పలు చర్యలు చేపట్టినట్లు ఆర్మీ అధికారులు చెప్పారు. డోక్లామ్‌లో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికైనా భారత్‌ సిద్ధంగా ఉందని ఇటీవల భారత రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. 

  • Loading...

More Telugu News