ntr: జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోనే ఉండాలి: హీరోయిన్ మాధవీలత

  • గత ఎన్నికల్లో ఎన్టీఆర్ ప్రచారం చేస్తారని భావించా
  • ఎందుకు పక్కన పెట్టారో అర్థం కావడం లేదు
  • ఎన్టీఆర్ చాలా మంచి వ్యక్తి

తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న లోపాలను ఎత్తిచూపుతూ వార్తల్లో నిలిచిన హీరోయిన్ మాధవీలత... మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఈసారి జూనియర్ ఎన్టీఆర్ గురించి ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. జనాలకు మంచి చేయాలనే ఆలోచన ఎన్టీఆర్ కి తాతగారి నుంచి వచ్చి ఉండవచ్చని చెప్పింది. అతను తెలుగుదేశం పార్టీలోనే ఉండాలని తెలిపింది.

వ్యక్తిగతంగా ఎన్టీఆర్ చాలా మంచి వ్యక్తి అని... మంచి మాటకారి అని చెప్పింది. గత ఎన్నికల్లో ఎన్టీఆర్ ప్రచారం చేస్తారని భావించానని... కానీ, ఆయనను ఎందుకు పక్కన పెట్టారో తనకు అర్థం కావడం లేదని తెలిపింది. తన వ్యాఖ్యలు కేవలం వ్యక్తిగతమేనని... దీనిని రాజకీయం చేయవద్దని కోరింది. తన వ్యాఖ్యలతో ఏ రాజకీయపార్టీకి సంబంధం లేదని చెప్పింది. కేవలం తన మనసులోని భావాలను మాత్రమే బయటపెట్టానని తెలిపింది.

ntr
junior ntr
madhavi latha
tollywood
Telugudesam
  • Loading...

More Telugu News