allu arjun: చరణ్ కి హిట్ ఇచ్చేసిన సుకుమార్ .. నెక్స్ట్ మూవీ అల్లు అర్జున్ తో?

  • 'రంగస్థలం' మూవీకి హిట్ టాక్ 
  • అదే నిర్మాతలతో సుకుమార్ 
  • ఈ కాంబినేషన్లో అల్లు అర్జున్ 

సుకుమార్ దర్శకుడిగా తన కెరియర్ ను మొదలెట్టేసి 14 సంవత్సరాలు అవుతోంది. ఇన్ని సంవత్సరాలలో ఆయన తెరకెక్కించిన సినిమాలు ఏడు మాత్రమే. ఈ ఏడు సినిమాలు కూడా వేటికవే ప్రత్యేకతను సంతరించుకుని కనిపిస్తూ ఉంటాయి. తాజాగా ఆయన నుంచి వచ్చిన 'రంగస్థలం' హిట్ టాక్ తెచ్చుకుని దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో ఆయన తదుపరి ప్రాజెక్టు అల్లు అర్జున్ తో ఉండవచ్చనే టాక్ వినిపిస్తోంది.

 'నా పేరు సూర్య' తరువాత అల్లు అర్జున్ ఎవరి సినిమానూ కమిట్ కాలేదు. 'రంగస్థలం'ను నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ వారికి సుకుమార్ మరో సినిమా చేసిపెట్టవలసి వుంది. తమ కాంబినేషన్లో చేయమని మైత్రీ మూవీ మేకర్స్ వారు అల్లు అర్జున్ ను అడిగితే, 'రంగస్థలం' ఫలితాన్ని బట్టి చూద్దాం అన్నాడట. ఇప్పుడు ఆ సినిమాకి వస్తోన్న రెస్పాన్స్ ను చూస్తుంటే .. నెక్స్ట్ మూవీ సుకుమార్ తో చేయడానికి అల్లు అర్జున్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి .      

  • Loading...

More Telugu News