singer pranavi: నన్ను స్టేజ్ మీద నుంచి తోసేశారు...కసిగా డిస్టింక్షన్ లో పాసై రుజువు చేసుకున్నాను: సింగర్ ప్రణవి

  • కేరీర్ ఆరంభంలో చాలా కష్టాలు పడ్డాను
  • అగ్లీగా ఉన్నానని, పక్కన కూడా నిలబడొద్దనేవారు
  • ఒకసారి స్టేజ్ పైనుంచి తోసేశారు కూడా

కెరీర్‌ ఆరంభంలో చాలా కష్టాలు పడ్డానని సినీ నేపథ్య గాయని ప్రణవి తెలిపింది. అలీతో జాలీగా షోకు భర్తతో పాటు హాజరైన ప్రణవి, కెరీర్ తొలినాళ్లలో అనుభవించిన అవమానాన్ని గుర్తు చేసుకుంది. చాలా సార్లు తాను పాడిన పాటలను తీసేసిన సందర్భాలు ఉన్నాయని తెలిపింది. అలాగే వేరేవాళ్లు పాడిన పాటలను తనతో పాడించిన సందర్భాలు కూడా ఉన్నాయని ప్రణవి చెప్పింది. ఒకసారి అందరితో కలిసి పాడుతుంటే స్టేజ్‌ పై నుంచి తనను తోసేశారని చెప్పింది.

అప్పటికే రెండు మూడు సార్లు అవహేళనగా మాట్లాడారని, 'అగ్లీగా ఉన్నావు, మా పక్కన నిలబడొద్దు' అని ఎద్దేవా చేశారని కన్నీటి పర్యంతమైంది. దీంతో కసిగా ఇకపైన వీరు నా వెనుక నిలబడి పాడాలనే పట్టుదలతో ప్రయత్నించి, డిప్లొమా డిస్టింక్షన్‌ లో పాసయ్యానని తెలిపింది. ఆ తరువాత సినిమాల్లో అవకాశాలను అందిపుచ్చుకుని సింగర్ గా నిరూపించుకున్నానని చెప్పింది. ఆ రోజు తనను అవమానించిన వారు ఇప్పుడు తన వెనుక వుండి పాడుతున్నారని గర్వంగా చెప్పింది. 

singer pranavi
pranavi
raghu
raghu master
ali
  • Loading...

More Telugu News