sri reddy: టీవీ ఛానల్ ప్రోగ్రామ్ డైరెక్టర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన నటి శ్రీరెడ్డి

  • ఈటీవీ ప్రోగ్రం డైరెక్టర్ అనిల్ కడియాలపై ఆరోపణలు
  • ప్రోగ్రాములకు వచ్చే అమ్మాయిలను మోసం చేస్తున్నాడు
  • ఆఫర్ల పేరుతో లొంగదీసుకుంటున్నాడు

సినీ పరిశ్రమలో మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులపై నటి శ్రీరెడ్డి తీవ్ర ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈటీవీలో ప్రోగ్రామ్ డైరెక్టర్ గా పని చేస్తున్న అనిల్  అనే వ్యక్తిపై ఆమె ఆరోపణలు చేసింది. ప్రోగ్రాములకు వచ్చే అమ్మాయిలను, యాంకర్లు కావాలని ట్రై చేస్తున్న అమ్మాయిలను దారుణంగా మోసగిస్తున్నాడని శ్రీరెడ్డి ట్వీట్ చేసింది.

 'అనిల్ కడియాల ఒక బజారు వెధవ' అంటూ దుర్భాషలాడింది. ఆఫర్ల పేరుతో అమ్మాయిలను లొంగదీసుకుంటున్నాడని చెప్పింది. అనిల్ వేధింపులపై సాక్ష్యాధారాలు ఉన్నాయని తెలిపింది.  అనిల్ అకృత్యాలకు అతని భార్య సహకరిస్తున్నారని తెలిపింది. పెద్ద యాంకర్ అయిన అతని భార్యకు ఎన్నో పరిచయాలు ఉన్నాయని... తనను ఎవరితో బెదిరిస్తుందో అంటూ భయాందోళన వ్యక్తం చేసింది.

sri reddy
etv programme director
anil kadiyala
  • Loading...

More Telugu News