Varun Dhawan: క్రికెటర్ స్టీవ్ స్మిత్‌ ఏడుపుకు చలించిపోయిన బాలీవుడ్ యంగ్ హీరో...!

  • స్మిత్ పట్ల వరుణ్ థావన్ సానుభూతి
  • క్రికెట్ ఫ్యాన్స్ అతన్ని తప్పక క్షమిస్తారు
  • నిషేధం కన్నా మానసిక వేదన చాలా ఎక్కువని వ్యాఖ్య

బాల్ ట్యాంపరింగ్ వివాదంతో ఏడాది పాటు నిషేధానికి గురైన ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ పట్ల బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ సానుభూతిని వ్యక్తం చేశాడు. తనపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తీసుకున్న చర్యల అనంతరం సిడ్నీలో నిర్వహించిన మీడియా సమావేశంలో స్మిత్ క్రికెట్ అభిమానులకు క్షమాపణలు చెబుతూ కన్నీళ్ల పర్యంతమవడం తనను ఎంతగానో కలచివేసిందని ధావన్ ట్వీట్ చేశాడు. స్మిత్‌ను క్రికెట్ అభిమానులు తప్పక క్షమిస్తారని తాను భావిస్తున్నట్లు చెప్పాడు.

స్మిత్‌ని చూస్తుంటే...చేసిన పొరపాటుకు అతను పశ్చాత్తాపానికి మించి కుమిలిపోతున్నాడని ధావన్ చెప్పుకొచ్చాడు. ఓ ఉత్తమ క్రికెటర్‌గా స్మిత్ ఈ కఠిన పరీక్ష నుంచి త్వరగా బయటపడగలడని తాను విశ్వసిస్తున్నానని, అందుకు దేవుడ్ని ప్రార్థిస్తున్నానని చెప్పాడు. నిషేధం కన్నా మానసిక వేదన చాలా ఎక్కువనే అభిప్రాయాన్ని ధావన్ వ్యక్తం చేశాడు. కాగా, సౌతాఫ్రికా జట్టుతో కీలకమైన మూడో టెస్టు సందర్భంగా బాల్ ట్యాంపరింగ్‌కు వ్యూహరచన చేసి, అమలు పరచడంలో కీలక పాత్ర పోషించారంటూ ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్‌తో పాటు వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌‍లను ఐసీసీ ఏడాది పాటు నిషేధించిన సంగతి తెలిసిందే.

Varun Dhawan
Steve Smith
ICC
David Warner
  • Loading...

More Telugu News