charan: చిట్టిబాబు నాలో చాలా మార్పులు తీసుకొచ్చాడు!: చరణ్

  • చిట్టిబాబు పాత్ర చేయడానికి భయపడ్డాను
  • వేషభాషలను దగ్గరగా పరిశీలించాను 
  • సమంత నా జోడీ కావడం కలిసొచ్చింది

ఇప్పుడు మెగా అభిమానులంతా 'రంగస్థలం' మేనియాలో వున్నారు. 'చిట్టిబాబు' పాత్రలో చరణ్ అదరగొట్టేశాడని చెప్పుకుంటున్నారు. ఇక తాజా ఇంటర్వ్యూలో చరణ్ మాట్లాడుతూ .. "చిట్టిబాబు నటుడిగా నాలో చాలా మార్పులు తీసుకొచ్చాడు. వినికిడి లోపం కలిగిన ఈ పాత్రను చేయడానికి ముందుగా భయపడ్డాను .. ఒక సవాలుగా భావించి చేశాను. కొత్తదనాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారనే విషయం మరోమారు నిజమైంది" అన్నాడు.

"నేను గ్రామాలకి ఎక్కువగా వెళ్లింది లేదు .. ఆ తరహా సినిమాలను పెద్దగా చేసింది లేదు. అందువలన నేను వేష భాషల విషయంలోను .. బాడీ లాంగ్వేజ్ విషయంలోను ప్రత్యేక దృష్టి పెట్టవలసి వచ్చింది. ఇక నా సహ నటిగా సమంత ఉండటం కూడా నా పాత్ర బాగా పండటానికి కారణమైంది. ఇంతవరకూ నాతో కలిసి చేసిన హీరోయిన్స్ లో సమంతకి మొదటిస్థానం లభిస్తుంది" అని చెప్పుకొచ్చాడు.    

charan
samanta
  • Loading...

More Telugu News