charan: బాబాయ్ రికార్డును అబ్బాయ్ క్రాస్ చేసేశాడు!

  • తెలుగు రాష్ట్రాల్లో 'రంగస్థలం' జోరు 
  • యూఎస్ లోను తగ్గని స్పీడు 
  • ఇక చెన్నై లోను అదే దూకుడు

తెలుగు కథ విదేశాల్లోనే తయారై .. విదేశాల్లోనే షూటింగు జరుపుకుంటోన్న ఈ రోజుల్లో, 'రంగస్థలం'తో పల్లెటూరి వాతావరణాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు సుకుమార్. గతంలో గ్రామీణ నేపథ్యంలో వచ్చిన చాలా చిత్రాలు ఘన విజయాలను సాధించాయి .. ఆయా హీరోల కెరియర్లో చెప్పుకోదగినవిగా నిలిచిపోయాయి. అలా 'రంగస్థలం' కూడా చరణ్ కెరియర్లో నిలిచిపోయేలా కనిపిస్తోంది.

 నిన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, తెలుగు రాష్ట్రాల్లో ఒక రేంజ్ లో దూసుకుపోతోంది. ఇక యూఎస్ లోను ఏ మాత్రం స్పీడ్ తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో చెన్నైలోను ఈ సినిమా తనసత్తా చాటుకుంది. తొలిరోజునే ఒక రికార్డును సొంతం చేసుకుంది. 'బాహుబలి' విషయం పక్కన పెడితే .. చెన్నైలో తొలిరోజున 24 లక్షల గ్రాస్ ను సాధించి ఇంతవరకూ 'అజ్ఞాతవాసి' మొదటిస్థానంలో వుంది. ఇక తాజాగా 25 లక్షల గ్రాస్ ను రాబట్టి 'రంగస్థలం' మొదటిస్థానంలో నిలిచింది. బాబాయ్ రికార్డును అబ్బాయ్ క్రాస్ చేయడం విశేషమే.    

  • Loading...

More Telugu News