bharat bandh: సుప్రీం ఆదేశాల నేపథ్యంలో... ఏప్రిల్ 2న భారత్ బంద్ చేపడుతున్న దళిత సంఘాలు!

  • అట్రాసిటీ కేసుల్లో పబ్లిక్ సర్వెంట్లను వెంటనే అరెస్ట్ చేయవద్దన్న సుప్రీం
  • దోషులు సాక్ష్యాధారాలను తారుమారు చేస్తారంటున్న దళిత సంఘాలు
  • దేశవ్యాప్తంగా ఆందోళనలకు సిద్ధం

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల నేపథ్యంలో పబ్లిక్ సర్వెంట్లను వెంటనే అరెస్ట్ చేయడాన్ని సుప్రీంకోర్టు నిషేధించింది. అపాయింటింగ్ అథారిటీ నుంచి పర్మిషన్ తీసుకున్న తర్వాతే అరెస్ట్ చేయాలని సర్వోన్నత న్యాయస్థానం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో, సుప్రీం నిర్ణయంపై దళిత సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సుప్రీం నిర్ణయం ఎస్సీ, ఎస్టీల రక్షణకు ప్రతిబంధకంగా మారుతుందని వారు అంటున్నారు.

ఈ నేపథ్యంలో, ఇప్పటి వరకు ఉన్న నిబంధనలను యథాతథంగా ఉంచాలని కోరుతూ దేశ వ్యాప్తంగా ఆందోళనలకు దళిత సంఘాలు సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా ఏప్రిల్ 2వ తేదీన భారత్ బంద్ కు దళిత సంఘాలు పిలుపునిచ్చాయి. అట్రాసిటీ కేసులపై పూర్తి విచారణ చేసిన అనంతరమే కేసులు నమోదు చేస్తే.... దోషులు సాక్ష్యాధారాలను తారుమారు చేసే అవకాశం ఉందని దళిత సంఘాల నేతలు అంటున్నారు.

bharat bandh
april 2
dalit organisations
Supreme Court
  • Loading...

More Telugu News