chiranjeevi: 'సైరా'కు భారీగా పెరగనున్న బడ్జెట్ .. వెనకడుగు వేసే ఆలోచనలో లేని చరణ్

  • షూటింగు దశలో 'సైరా'
  • కీలక సన్నివేశాల చిత్రీకరణ 
  • బడ్జెట్ పెరగడం ఖాయమని భావించిన చరణ్

'సైరా' షూటింగ్ చకచకా జరిగిపోతోంది. రీసెంట్ గా చిరంజీవి .. నయనతార .. అమితాబ్ కాంబినేషన్లోని సన్నివేశాలను చిత్రీకరించారు. ఇందుకు సంబంధించిన స్టిల్స్ చూసిన వాళ్లు .. 'బాహుబలి' సినిమాను గుర్తుచేసుకున్నారు. అయితే ఖర్చు కూడా ఆ స్థాయిలో ఉండేట్టుగానే ఉందని తెలుస్తోంది. ఇంతవరకూ అయిన ఖర్చు .. ముందుగా అనుకున్న దానికంటే రెట్టింపు అయిందట.

 దీనిని బట్టి తాము అనుకున్న బడ్జెట్ లో ఈ సినిమాను పూర్తి చేయడం కుదరకపోవచ్చనీ .. భారీగానే బడ్జెట్ పెరగొచ్చని అనుకుంటున్నారట. భారీ సెట్స్ కు .. జూనియర్ ఆర్టిస్టులకు .. వార్ సీన్స్ కు .. కాస్ట్యూమ్స్ కు .. గ్రాఫిక్స్ కు భారీ మొత్తంలోనే ఖర్చు అయ్యేలా ఉందనే అభిప్రాయానికి వచ్చారని సమాచారం. ఈ ప్రాజెక్టును ప్రతిష్ఠాత్మకంగా భావించిన చరణ్ .. ఎక్కడా రాజీ పడే ఆలోచనలో లేడని చెప్పుకుంటున్నారు.      

chiranjeevi
nayanatara
  • Loading...

More Telugu News