Chiranjeevi: అమితాబ్ కు రాచమర్యాదలు చేసిన చిరంజీవి!

  • అమితాబ్ కు తన రోల్స్ రాయిస్ కారు పంపించిన చిరు
  • రెండు రోజుల పాటు అమితాబ్ తోనే ఉన్న కారు
  • చిన్న ఇబ్బంది కూడా తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్న చిరు

బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ తో మెగాస్టార్ చిరంజీవికి మంచి అనుబంధం ఉంది. ఈ కారణంగానే చిరు తాజా చిత్రం 'సైరా నరసింహారెడ్డి'లో బిగ్ బీ నటిస్తున్నారు. షూటింగ్ సందర్భంగా హైదరాబాద్ వచ్చిన అమితాబ్ కు చిరంజీవి రాచమర్యాదలు చేశారు. హోటల్ నుంచి షూటింగ్ లొకేషన్ కు రావడానికి అమితాబ్ కు తన రోల్స్ రాయిస్ కారును చిరు పంపించారు. షూటింగ్ జరిగిన రెండు రోజుల పాటు ఆ కారు అమితాబ్ వద్దే ఉంది. అంతేకాదు, అమితాబ్ కు కట్టుదిట్టమైన సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేశారు. షూటింగ్ లో ఉన్నన్ని రోజులు అమితాబ్ కు చిన్న ఇబ్బంది కూడా కలగకుండా చిరు అన్ని జాగ్రత్తలూ తీసుకున్నారని సమాచారం.

Chiranjeevi
Amitabh Bachchan
saira
Sye Raa Narasimha Reddy
  • Loading...

More Telugu News