Anushka Sharma: అనుష్క శర్మ నిర్మాణంలో మరో 'మూడు...!'

  • అనుష్క శర్మ బ్యానర్‌లో మరో మూడు చిత్రాలు
  • గత చిత్రాల మాదిరిగానే విభిన్న కథాంశాలతో రూపకల్పన
  • యువ టాలెంట్‌కు అవకాశం

బాలీవుడ్ ముద్దుగుమ్మ అనుష్క శర్మ ఒకవైపు హీరోయిన్‌గా రాణిస్తూనే మరోవైపు సినిమాలు నిర్మిస్తోంది. ఇప్పటివరకు ఆమె ఎన్‌హెచ్10, ఫిల్లౌరీ, పారీ చిత్రాలను తన 'క్లీన్ స్లేట్ ఫిల్మ్స్' బ్యానర్‌పై ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చింది. ఈ మూడు సినిమాలు కూడా విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాక బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల పంట పండించాయి. రానున్న రోజుల్లో ఆమె మరో మూడు చిత్రాలను నిర్మించనున్నట్లు తాజా సమాచారం. వీటికి సంబంధించిన వివరాలను అనుష్క త్వరలోనే వెల్లడించనుంది.

తన గత చిత్రాల మాదిరిగానే ఇవి కూడా విభిన్న కథాంశాలతో తెరకెక్కనున్నాయి. ఈ సారి కూడా ఆమె యువ నటీనటులకు ఛాన్స్ ఇవ్వనున్నట్లు తెలిసింది. మరోవైపు ఆమె నటించిన మూడు చిత్రాలు ఈ ఏడాదే రిలీజ్ కానున్నాయి. సంజయ్ దత్ బయోపిక్, వరుణ్ థావన్ సరసన చేస్తున్న మరో చిత్రం, బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ హీరోగా రూపొందుతున్న 'జీరో' చిత్రాలు ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

  • Error fetching data: Network response was not ok

More Telugu News