uma bharati: గాంధీ స్మృతి మందిరంపై ఉన్న హే రామ్ పదాన్ని తొలగించండి: ఉమా భారతి

  • అంబేద్కర్ పేరు మార్పును రాజకీయం చేయొద్దు
  • అంబేద్కర్ అసలు పేరులో రామ్ జీ ఉంది
  • ప్రతిపక్షాలపై మండిపాటు 

 గాంధీ స్మృతి మందిరంపై ఉన్న హే రామ్ పదాన్ని తొలగించాలని కేంద్ర మంత్రి ఉమాభారతి డిమాండ్ చేశారు. ఢిల్లీలో ఆమె మాట్లాడుతూ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు మార్పును రాజకీయం చేయకూడదని సూచించారు. అంబేద్కర్ అసలు పేరులో రామ్ జీ ఉందని, దానిని కొందరు కావాలనే తొలగించారని ఆమె ఆరోపించారు. తాము గతంలో ఉన్న అంబేద్కర్ పేరునే పెట్టామని ఆమె యూపీ ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించారు. రాముడి పేరుతో రాజకీయాలు చేయాలనుకుంటే ముందు గాంధీ స్మృతి మందిరంపై ఉన్న హే రామ్ పదాన్ని తొలగించాలని ఆమె ప్రతిపక్షాలను డిమాండ్ చేశారు. 

uma bharati
Uttar Pradesh
br ambedkar
ambedkar name
  • Loading...

More Telugu News