Ramcharan movie: తెలుగు ప్రజల మనసు గెలిచే ప్రయత్నంలో బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్

  • రామ్ చరణ్ మూవీలో ప్రతినాయకుని పాత్ర
  • తెలుగు నేర్చుకునేందుకు ప్రయత్నం
  • తనతో తెలుగులోనే మాట్లాడాలంటూ యూనిట్ సిబ్బందికి సూచన

బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ మరోసారి తెలుగు ప్రజల మనసు గెలిచే ప్రయత్నంలో ఉన్నారు. గతంలో రామ్ గోపాల్ వర్మ తీసిన 'రక్త చరిత్ర'లో ప్రధాన పాత్ర పోషించిన తర్వాత మరోసారి తెలుగు చిత్రంలో నటిస్తున్నాడు. రామ్ చరణ్ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న ఓ చిత్రంలో వివేక్ ఒబెరాయ్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ఇంకా పేరును ఖరారు చేయాల్సి ఉంది. అయితే, ఈ సినిమా షూటింగ్ బృందం ఇప్పుడు ఒబెరాయ్ ఆసక్తిని చూసి తెగ ముచ్చటపడిపోతోంది.

తెలుగు భాషను నేర్చుకునేందుకు ఆయన ఎంతో ఆసక్తిని చూపిస్తున్నారు.  తెలుగులో మాట్లాడాలని తహతహలాడుతున్నారు. ఇందుకోసం షూటింగ్ స్పాట్ కు వచ్చింది మొదలు తనతో తెలుగులోనే మాట్లాడాలంటూ అక్కడున్న వారిని కోరుతుండడం ఆసక్తికరం. ముఖ్యంగా ఈ సినిమాలో ఆయన ప్రతినాయకుడి పాత్రను పోషిస్తున్నారు. దీంతో తన పాత్రను మరింత పండించాలనే అభిలాషతో తెలుగుపై పట్టు సాధించేందుకు కృషి చేస్తున్నారు. ఆయన వాక్చాతుర్యం, ఉచ్చారణ చూసి షూటింగ్ సిబ్బంది మెచ్చుకుంటున్నారని సమాచారం.

Ramcharan movie
vivek oberoi
  • Loading...

More Telugu News