Cricket: నా కలల జట్టే ప్రపంచంలో అత్యంత బలమైన జట్టు: యూనిస్ ఖాన్

  • తన ఆల్ టైమ్ టెస్టు క్రికెట్ కలల జట్టును ప్రకటించిన యూనిస్ ఖాన్
  • జట్టులో సచిన్ కు స్థానం.. ఓపెనర్ గా ఎంపిక
  • కెప్టెన్ గా ఇమ్రాన్ ఖాన్

పాకిస్థాన్‌ వెటరన్ క్రికెటర్ యూనిస్‌ ఖాన్‌ తన ఆల్‌ టైమ్‌ టెస్టు క్రికెట్‌ కలల జట్టును ప్రకటించాడు. పాక్ లో టెస్టు, వన్డే, టీ20 ఫార్మాట్ లలో కెప్టెన్సీ వహించిన ఆటగాడిగా, పాక్ తరపున టెస్టుల్లో అత్యధిక పరుగులు, సెంచరీలు సాధించిన క్రికెటర్ గా రికార్డు నెలకొల్పిన యూనిస్ ఖాన్, తాను ప్రకటించిన జట్టే ప్రపంచంలోని అత్యంత బలమైన జట్టని పేర్కొన్నాడు.

లార్డ్స్‌ క్రికెట్‌ గ్రౌండ్‌ సోషల్‌ మీడియా ద్వారా యూనిస్‌ ఖాన్‌ ప్రకటించిన జట్టుకు కెప్టెన్ గా పాకిస్థాన్ ప్రస్తుత విపక్ష పార్టీ అధినేత, దిగ్గజ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ ను పేర్కొన్నాడు. ఓపెనర్లుగా, హనీఫ్‌ మహమ్మద్‌, సచిన్‌ టెండూల్కర్ లకు స్థానం కల్పించాడు. ఆ తరువాతి స్థానాల్లో సఫారీ ఆల్‌ రౌండర్‌ జాక్వస్ కలీస్‌, బ్రయన్‌ లారా, సర్‌ వివ్‌ రిచర్డ్స్‌, గ్యారీ సోబర్స్‌, వికెట్‌ కీపర్‌, బ్యాట్స్ మన్ ఆడమ్‌ గిల్‌ క్రిస్ట్‌ లకు స్థానం కల్పించాడు. స్పెషలిస్టు బౌలర్లుగా కెప్టెన్ తో పాటు సర్‌ రిచర్డ్‌ హడ్లే, గ్లేన్‌ మెక్‌ గ్రాత్‌, ముత్తయ్య మురళీధరన్‌ లకు స్థానం కల్పించాడు.

Cricket
yunis khan
all time great cricket team
Pakistan
  • Loading...

More Telugu News