kcr: కేసీఆర్ ది థర్డ్ ఫ్రంట్ కాదు .. ఉత్త టెంటే!: టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి

  • ఎల్లుండి నుంచి మూడో దశ బస్సుయాత్ర ప్రారంభించనున్నాం
  • వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఒకట్రెండు ఎంపీ సీట్లకు మించి రావు
  • వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో, కేంద్రంలోనూ విజయం సాధిస్తాం
  • మా అభ్యర్థులను ఆరు నెలల ముందుగానే ప్రకటిస్తాం

కేసీఆర్ ది థర్డ్ ఫ్రంట్ కాదని ఉత్త టెంటేనని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎల్లుండి నుంచి కాంగ్రెస్ పార్టీ మూడో దశ బస్సు యాత్రను ప్రారంభించనున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి, సంపత్ ల శాసనసభ సభ్యత్వాలను టీఆర్ఎస్ ప్రభుత్వం రద్దు చేయడంపై మండిపడ్డారు.

బహిష్కరణకు గురైన కోమటిరెడ్డి, సంపత్ లకు రాహుల్ గాంధీ కూడా మద్దతుగా నిలుస్తున్నారని, రాజ్యాంగ విరుద్ధంగా ఇద్దరు ఎమ్మెల్యేలను బహిష్కరించడం, సస్పెండ్ చేయడంపై ప్రజలకు వివరిస్తామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఒకట్రెండు ఎంపీ సీట్లకు మించి రావని అన్నారు. వచ్చే ఎన్నికలకు సంబంధించి ఆరు నెలల ముందుగానే తమ అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పారు. రాష్ట్రంలో, కేంద్రంలోనూ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తమ పార్టీలో చేరిన రేవంత్ రెడ్డి సహా మరికొంత మందికి త్వరలో పార్టీ పదవులు ఇస్తామని ఉత్తమ్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News