rangasthalam: నందిగామలో ‘రంగస్థలం’ సినిమా మధ్యలో నిలిపివేత.. ఫాన్స్ ఆందోళన.. ఉద్రిక్తత!

  • కృష్ణా జిల్లా నందిగామలోని మయూరి థియేటర్‌లో ఘటన
  • అధిక ధరలకు టికెట్లు విక్రయించారని కలెక్టర్‌కు ఫిర్యాదు 
  • విచారణ పేరుతో సినిమా ప్రదర్శన నిలిపేసిన తహశీల్దార్‌

మైత్రీ మూవీ మేకర్స్ బ్యాన‌ర్ పై రామ్ చరణ్ తేజ్, సమంత, ఆది, ప్రకాశ్‌ రాజ్‌, జగపతిబాబు ప్రధాన పాత్ర‌ల్లో ద‌ర్శ‌కుడు సుకుమార్ తెర‌కెక్కించిన 'రంగ‌స్థ‌లం' సినిమా ఈ రోజు విడుద‌లైన విష‌యం విదితమే. ఆ సినిమా ఆడుతోన్న థియేటర్లు ప్రేక్షకులతో నిండిపోతున్నాయి. కాగా, కృష్ణా జిల్లా నందిగామలోని మయూరి థియేటర్‌లో 'రంగస్థలం' సినిమా ప్రదర్శన జరుగుతుండగా దాన్ని మధ్యలోనే ఆపేశారు.

 ఆ థియేటర్‌ యాజమాన్యం టికెట్‌లను అధిక ధరలకు అమ్ముకుంటోందని కొందరి నుంచి ఫిర్యాదు అందడంతో జిల్లా కలెక్టర్‌కు ఆదేశాల మేరకు స్థానిక తహశీల్దార్‌ థియేటర్‌కు చేరుకొని విచారణ పేరుతో సినిమా ప్రదర్శనను మధ్యలో నిలిపివేసినట్లు తెలిసింది. ఒక్కసారిగా సినిమా ఆగిపోయినందుకు ప్రేక్షకులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు థియేటర్ వద్దకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

rangasthalam
Ramcharan
Krishna District
  • Loading...

More Telugu News