bjp: ఆవు మాంసం తిన్న వాళ్లను చంపించిన ఘనత బీజేపీదే!: నక్కా ఆనందబాబు

  • ప్రజలేమి తినాలో బీజేపీ వాళ్లే చెబుతున్నారు!
  • న్యాయ, పార్లమెంట్ వ్యవస్థలను కేంద్రం భ్రష్టు పట్టించింది
  • ఏపీకి న్యాయం చేసే వరకు కేంద్రంపై పోరాటం ఆగదు

ప్రజలేమి తినాలో కూడా బీజేపీ వాళ్లే చెబుతున్నారని, ఆవు మాంసం తిన్న వాళ్లను చంపించిన ఘనత బీజేపీదేనని ఏపీ మంత్రి నక్కా ఆనందబాబు విమర్శించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, దేశ రక్షణను కాపాడాల్సిన నిఘా వ్యవస్థను కూడా బీజేపీ ప్రభుత్వం రాజకీయ అవసరాలకు వాడుకుంటోందని విమర్శించారు.

 న్యాయ, పార్లమెంట్ వ్యవస్థలను కేంద్ర ప్రభుత్వం భ్రష్టు పట్టించిందని దుయ్యబట్టారు. ఏపీ ప్రయోజనాల కోసం పాటుపడుతున్న చంద్రబాబుకు ప్రజలు అండగా నిలవాలని, ఏపీకి న్యాయం చేసే వరకు కేంద్రంపై తమ పోరాటం ఆగదని అన్నారు.

bjp
Telugudesam
nakka anand babu
  • Loading...

More Telugu News