seetharam yechury: ఫెడరల్ ఫ్రంట్‌ గురించి ఆలోచిస్తాం: సీతారాం ఏచూరి

  • మేము ఇంకా ఫెడరల్ ఫ్రంట్‌పై చర్చించ లేదు
  • రెండు వారాలుగా టీడీపీ, వైసీపీ అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇస్తున్నాయి
  • అవిశ్వాస తీర్మానాలను తీసుకురావడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం

తాము ఇంకా ఫెడరల్ ఫ్రంట్‌పై చర్చించ లేదని, ఎన్నికల సమయంలో ఆలోచిస్తామని సీపీఎం జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ సీతారాం ఏచూరి అన్నారు. ఈ రోజు ఆయ‌న ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. రెండు వారాలుగా టీడీపీ, వైసీపీ కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇస్తున్నాయని, తాము కూడా ఇత‌ర పార్టీల‌తో పాటు  అవిశ్వాస తీర్మానం ఇస్తున్నామ‌ని తెలిపారు.

అవిశ్వాస తీర్మానాలను తీసుకురావడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమవుతోందని, అవిశ్వాస తీర్మానంపై భయపడుతూ తప్పించుకునే ధోరణిలో వ్యవహరిస్తోందని సీతారాం ఏచూరి వ్యాఖ్యానించారు. పార్ల‌మెంటులో అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగితే ఏపీకి కేంద్ర ప్ర‌భుత్వం ఇచ్చిన హామీలు సహా బీజేపీ వైఫల్యాలపై చర్చిస్తామ‌ని అన్నారు.

seetharam yechury
cpm
Special Category Status
Andhra Pradesh
  • Loading...

More Telugu News