Cricket: ఐపీఎల్‌కు దూరమైన ఆస్ట్రేలియా ఆటగాడు మిచెల్ స్టార్క్‌

  • మిచెల్‌ను రూ.9.4 కోట్లకు సొంతం చేసుకున్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌
  • తాజాగా మిచెల్ స్టార్క్‌ కాలికి గాయం 
  • ఇప్పటికే భుజానికి గాయంతో మరో ఆసీస్ క్రికెటర్ క్రిస్‌లీన్‌ దూరం
  • మిచెల్‌ స్టార్క్‌ స్థానంలో చాధ్‌ సేయర్స్ (31)

కాలి గాయం కారణంగా ఆస్ట్రేలియా క్రికెటర్ మిచెల్ స్టార్క్‌ ఐపీఎల్‌కు దూరమయ్యాడు. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా తమ ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించింది. మిచెల్ స్టార్క్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టు తరఫున ఆడాల్సి ఉంది. అదే జట్టులో ఇప్పటికే భుజానికి గాయంతో మరో ఆసీస్ క్రికెటర్ క్రిస్‌లీన్‌ దూరమయ్యాడు. ఇద్దరు స్టార్ ఆటగాళ్లు జట్టుకు దూరం కావడం కోల్‌కతా నైట్‌రైడర్స్ కు పెద్ద దెబ్బేనని విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా, మిచెల్‌ స్టార్క్‌ స్థానంలో చాధ్‌ సేయర్స్ (31) కోల్‌కతా నైట్‌రైడర్స్ టీమ్‌లో ఆడనున్నాడు. ఇటీవల జరిపిన ఐపీఎల్‌ వేలంలో మిచెల్‌ స్టార్క్‌ను కోల్‌కతా జట్టు రూ. 9.4 కోట్లకు సొంతం చేసుకుంది. 

Cricket
ipl
michel starc
  • Error fetching data: Network response was not ok

More Telugu News