AMAZON: పన్నులు చెల్లించడం లేదంటూ అమేజాన్ పై నిప్పులు చెరిగిన అమెరికా అధ్యక్షుడు

  • వేలాది మంది రిటైలర్లను రోడ్డున పడేస్తోంది
  • పోస్టల్ వ్యవస్థను డెలివరీ బోయ్ గా వాడుకుంటోంది
  • అయినా పన్నులు కట్టడం లేదంటూ ట్రంప్ విమర్శలు

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈ సారి తన విమర్శలకు ప్రపంచ రిటైల్ దిగ్గజం అమేజాన్ ను లక్ష్యంగా చేసుకున్నారు. అమెరికాలో నంబర్ 1 రిటైలర్ గా ఉన్న అమేజాన్, పలు ఇతర దేశాల్లోనూ రిటైల్ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. అయితే, తగినన్ని పన్నులు మాత్రం చెల్లించడం లేదని ట్రంప్ విమర్శించారు. అమెరికా పోస్టల్ వ్యవస్థ నుంచి లబ్ధి పొందడమే కాకుండా, చిన్న రిటైలర్లు వ్యాపారం నుంచి తప్పుకునేందుకు కారణమైన అమేజాన్ పన్నులు ఎగ్గొడుతోందంటూ మండిపడ్డారు. వాస్తవానికి ట్రంప్ ఎప్పటి నుంచో అమేజాన్ పై ఈ విధమైన దాడి చేస్తూనే ఉన్నారు.

అయితే, తాజాగా యాక్సియోస్ అనే వెబ్ సైట్ అమేజాన్ ప్రపంచ అతిపెద్ద ఆన్ లైన్ రిటైలర్ గా తన శక్తిని పెంచుకుంటోందని, యాంటీ ట్రస్ట్, పోటీ నిరోధక చట్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందంటూ ఓ కథనాన్ని ప్రచురించింది. దీంతో ట్రంప్ మరోసారి అమేజాన్ పై విమర్శలు గుప్పించారు. ‘‘అమేజాన్ కు అధ్యక్ష ఎన్నికలకు చాలా ముందే నా ఆందోళనలను తెలియజేశా. ఇతరుల మాదిరిగా కాకుండా ఆ సంస్థ చాలా తక్కువ లేదా అసలు పన్నులే కట్టడం లేదు. మా పోస్టల్ వ్యవస్థను వారి డెలివరీ బోయ్ గా వినియోగించుకుంటోంది. వేలాది మంది రిటైలర్లు వ్యాపారం నుంచి తప్పుకునేలా చేస్తోంది’’ అని ట్రంప్ ద్వజమెత్తారు. 

  • Loading...

More Telugu News